ఆ రాశివారు నేడు శత్రువులపై విజయం సాధిస్తారు!- ఇష్ట దేవతారాధన శుభకరం!
2026 ఫిబ్రవరి 26వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Published : February 26, 2026 at 12:02 AM IST
Horoscope Today February 26th 2026 : 2026 ఫిబ్రవరి 26వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టయోగం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి దైవబలం సహకరిస్తుంది. కీలక వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభకరం.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంలో కీలక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఈ రోజు ముఖ్యంగా కళాకారులు, రచయితలకు కలిసి వస్తుంది. అందివచ్చిన అవకాశాలు వినియోగించుకుని ఉత్తమమైన సృజనకి శ్రీకారం చుట్టండి. ఆర్థిక వ్యవహారాల్లో నిదానం వహించాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో రాజీ ధోరణి అవలంబించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. వ్యాపారంలో స్థిరనిశ్చయంతో ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. దైవానుగ్రహంతో ఆదాయమార్గాలు విస్తరిస్తాయి. ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. డబ్బు తెలివిగా ఖర్చు చేయాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలున్నప్పటికీ పట్టుదలతో ప్రయత్నిస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. కీలక వ్యవహారాల్లో స్వీయ నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. కుటుంబ సభ్యులతో గొడవలు, అపార్థాలు రాకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అదనపు ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. ప్రారంభించిన పనులల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులు స్నేహితుల సహకారంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్లారు. వృథా ఖర్చులు నివారించండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనువైన సమయం. వృత్తి పరమైన శుభవార్తలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. ధనధాన్య లాభాలున్నాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. బుద్ధిబలంతో కొన్ని కీలక వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో స్వల్ప ప్రయత్నంతోనే విజయం సాధిస్తారు. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దర్శనం మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులన్నీ సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. అర్థలాభం ఉంది. అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో విజయావకాశాలు పెరుగుతాయి. వృత్తిఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. మనోధైర్యంతో చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి. వ్యాపారంలో విశేషమైన ధనలాభాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో సహనం, ఓర్పు తగ్గకుండా చూసుకోండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తి కావాలంటే పట్టుదల అవసరం. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపావేశాలు అదుపులో ఉంచుకుని శాంతంగా ఉంటే మంచిది. వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ఫలాన్ని అందిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొత్త ప్రాజెక్టులు వాయిదా వేస్తే మంచిది. అస్థిరబుద్ధి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనుల్లో పెద్దల సలహాలు పనిచేస్తాయి. ప్రయాణాలు చేయకూడదు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. విఘ్నవినాయకుని దర్శనం శ్రేయస్సునిస్తుంది.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి లోపిస్తుంది. ప్రారంభించిన పనుల్లో జాప్యం చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించండి. కుటుంబపరమైన బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా మీ అంచనాలు తప్పవచ్చు. అనారోగ్య సమస్యలతో శక్తి, ఉత్సాహం కొరవడుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కలతకు గురి చేయవచ్చు. కుటుంబ సభ్యులతో గొడవలు, వాదనలకు దిగవద్దు. వృత్తిపరంగా కలిగే నష్టాలు ఆందోళనకు కలిగిస్తాయి. శని శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగుతాయి.

