ETV Bharat / spiritual

ఆ రాశి వారు నేడు ఖర్చులు తెలివిగా పెట్టాల్సిందే- శివారాధన శ్రేయస్కరం!

2026 ఏప్రిల్ 14వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (ETV BHARAT)
author img

By ETV Bharat Telugu Team

Published : April 14, 2026 at 12:01 AM IST

4 Min Read
Choose ETV Bharat

Horoscope Today April 14th 2026 : 2026 ఏప్రిల్ 14వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో ముందుకెళ్తే చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు అందుతాయి. వృత్తి పరంగా ఎటువంటి ఆందోళనలు ఉండవు. ఉద్యోగ వ్యాపారాల్లో ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం వలన లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించి పొదుపు పాటించడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. దుర్గాదేవి ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అత్యంత శుభ సమయం నడుస్తోంది. ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. మీ కర్తవ్యాలు, ఆశయాలు అన్నీ ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మీ కృషికి అదృష్టం కూడా తోడు కావడంతో అద్భుతంగా రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయి. కుటుంబంతో సరదాగా విహార యాత్రకు వెళ్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి నిరుత్సాహం కలిగిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలం కాదు. ఆర్థిక పరంగా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. అనవసర ఖర్చులు పెరగవచ్చు. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేయండి. ఆనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ప్రారంభించిన పనులు పూర్తి కావాలంటే సహనం, శాంతం అవసరం. ఉద్యోగంలో పురోగతి లోపిస్తుంది. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. భాగస్వామ్య నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. నిరుత్సాహాన్ని, నిరాశావాదాన్ని దూరంగా ఉంచితే మంచిది. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో ఘర్షణలు మానుకోండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగుతాయి.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవానుగ్రహంతో ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో సరైన ప్రణాళికతో ముందుకెళ్తే విజయంతో పాటు ఆర్థిక లాభాలు కూడా పొందవచ్చు. కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తుంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమై పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరగవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో ఒత్తిడి అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు నియంత్రించడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పనిఒత్తిడి పెరుగుతుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అసహనం కలిగిస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. మీ పరుష మాటలతో కుటుంబ సంబంధాలు దెబ్బ తింటాయి. కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే సంఘటనలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులతో ఘర్షణలు, వివాదాలకు తావు లేకుండా చూసుకోండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో ప్రతికూలతలు తొలగుతాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో సమస్యలు ముందే గుర్తించి పరిష్కరించడం వలన అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో నూతన ప్రణాళికలతో ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మంచిది. పరోపకార కార్యక్రమాలతో కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు శుభయోగాలున్నాయి. పెట్టుబడులు పెరగడంతో లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. లక్ష్య సాధనలో ఆటంకాలు తొలగుతాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ముఖ్యమైన పనులు జాగ్రత్తగా నిర్వహించాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభకరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా శ్రేష్టమైన సమయం నడుస్తోంది. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో గతంలోని సమస్యలు తొలగడంతో ఆర్థికంగా అబ్దివృద్ధి చెందుతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తీర్ధయాత్రలతో ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మహాలక్ష్మి అష్టకం పఠించడం ఐశ్వర్యాన్నిస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీకు ఆర్థిక పరంగా గొప్పగా ఉంటుంది. గతంలోని రావలసిన బకాయిలు వసూలవుతాయి. పిత్రార్జితం ద్వారా కానీ, బంధువుల నుంచి కానీ ఆకస్మిక ధనలాభాలు అందుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి. సన్నిహితులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు తెలివిగా అధిగమిస్తారు. ఆర్థికంగా విశేషమైన లాభాలు చేకూరుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. కీలక నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం వలన మేలు జరుగుతుంది. అవివాహితులకు వివాహ సూచన ఉంది. ఖర్చులు తెలివిగా నిర్వహించండి. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శ్రేయస్కరం.