ETV Bharat / spiritual

ఆ రాశి వారికి బంగారు భవిష్యత్తు- సంపదలు, సౌభాగ్యాలు సిద్ధించే మంచి సమయం!

2026 జూన్ 4వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 4, 2026 at 12:02 AM IST

4 Min Read
Choose ETV Bharat

Horoscope Today 4th June 2026 : 2026 జూన్ 4వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహ సంచారం మిశ్రమంగా ఉన్నందున అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలున్నప్పటికీ బుద్ధి కుశలతతో వ్యవహరిస్తే సమస్యలు తొలగుతాయి. ఉద్యోగంలో చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారి తీయకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. కుటుంబంలో అనవసరమైన వాదనలు, ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూలమైన సమయం నడుస్తోంది. ఆత్మవిశ్వాసంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. సృజనాత్మక వ్యూహాలతో వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అనుకోకుండా ధనసంపదలు కలిసి రావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. దూరదేశాల నుంచి శుభ వర్తమానం అందుకుంటారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. కీలక సమావేశాల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు ఆశించిన ఫలితాన్ని అందిస్తాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆచి తూచి నడుచుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. మీ ఓర్పు, సహనం కుటుంబంలో ప్రశాంతత నింపుతుంది. వివాదాలు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఒక సువర్ణావకాశం మీ ఇంటి తలుపు తడుతుంది. అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఐశ్వర్యవంతులవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో సాహసోపేతమైన నిర్ణయాలతో విజయాలు సాధిస్తారు. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభకరం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనిశ్చితి నెలకొంటుంది. ప్రారంభించిన పనుల్లో తరచూ ఆటంకాలు చికాకు పెడతాయి. వ్యాపారంలో ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆర్థిక వ్యవహారాలు తెలివిగా నిర్వహించాలి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఉన్నతంగా ఉంటుంది. స్థిరాస్తి యోగాలు బలంగా ఉన్నాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచి రోజు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు, గౌరవం పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గురుబలం అనుకూలతతో అన్ని రంగాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన ధనలాభాలు, నూతన అవకాశాలు అందుకుంటారు. అధికారులు మీ ప్రతిభను గుర్తించి పదోన్నతులతో ప్రోత్సహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతుంది. కనకధారా స్తోత్ర పారాయణం శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. పితృ వర్గం నుంచి ఆర్థిక లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. శివారాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోయే ప్రమాదముంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ కలహాలు అశాంతి కలిగిస్తాయి. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగుతాయి.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. శ్రేష్ఠమైన శుభసమయం నడుస్తోంది. బంగారు భవిష్యత్తు ఎదురు చూస్తోంది. సంపదలు, సౌభాగ్యాలు సిద్ధించే మంచి సమయం రానుంది. ముఖ్యమైన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. విశేషమైన ఆర్థిక లాభాలు అందుకుంటారు. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పనులు వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడం మంచిది. కాలయాపనతో నష్టపోయే ప్రమాదముంది. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీలు తెలివిగా నిర్వహించాలి. వృథా ఖర్చులు నివారించండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శనిధ్యానంతో ప్రతికూలతలు తొలగుతాయి.

శ్రీకృష్ణుడు సంచరించిన పుణ్యక్షేత్రాలు- సప్త మోక్ష ధామాల విశేషాలివే!

రెండు చేతులతో దర్శనమిచ్చే అరుదైన వినాయకుడు- కర్పగ వినాయగర్ ఆలయ మహిమలు తెలుసా?