ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఉద్యోగంలో అధిక పనిభారం- అనారోగ్య సమస్యలతో ఇబ్బంది- సూర్యాష్టకం పఠించడం శ్రేయస్కరం!

2026 సెప్టెంబర్​ 3వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
రాశి ఫలాలు (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : September 3, 2026 at 12:01 AM IST

4 Min Read
Choose ETV Bharat

Horoscope Today 3rd September 2026 : 2026 సెప్టెంబర్​ 3వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వలన లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆనందభరితంగా ఉంటుంది. స్నేహితులు, ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహబలం అంత అనుకూలంగా లేనప్పటికీ పట్టుదలతో పట్టుదలతో ప్రయత్నిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యాపారంలో సొంత నిర్ణయాలతో నష్టం కలగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు లేకుండా నిదానంగా వ్యవహరించాలి. కుటుంబ విషయాల్లో ధైర్యం, సహనం అవసరం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనువైన రోజు. లక్ష్య సాధనలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా సానుకూల పరిణామాలు ఆనందం కలిగిస్తాయి. స్నేహితుల ద్వారా ఆర్థిక లబ్ది పొందుతారు. సన్నిహితుల సహాయ సహకారాలతో కీలక వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వరుని ఆలయ సందర్శనం శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉండాల్సిన సమయం. అనుకోని ఆపదలు పొంచి ఉన్నందున అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత, వృత్తిపరమైన వ్యవహారాలలో ఆచి తూచి అడుగేయాలి. ఉద్యోగంలో అధిక పనిభారంతో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరమైన చిక్కులు రాకుండా వృథా ఖర్చులు నివారించండి. కుటుంబ సమస్యలు అశాంతి కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్యాష్టకం పఠించడం శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు సానుకూలంగా ఉంటాయి. దైవానుగ్రహంతో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో మీ సామర్ధ్యానికి తగిన పదోన్నతులు లభిస్తాయి. శుక్ర గ్రహ అనుకూలతతో ధనలాభాలు ఉంటాయి. మానసికంగా, శారీరకంగా శక్తిమంతంగా ఉంటారు. ఈ అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పఠిష్టమైన ప్రణాళికతో పనులు నిర్వహించడం మంచిది. ఉద్యోగ వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులు కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి ఆప్తుల సహకారం లభిస్తుంది. దైవానుగ్రహంతో ముఖ్యమైన పనుల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో వివాదాలు ఏర్పడకుండా కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యం కూడా స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. శివారాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. శ్రేష్టమైన సమయం నడుస్తోంది. అధికారపరిధితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయి. దృఢ సంకల్పంతో ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఖర్చులు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. సంయమనం పాటించండి. బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు సహనంతో ఉండాలి. కీలక విషయాల్లో ఓర్పుతో వ్యవహరిస్తే సత్ఫలితాలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర వ్యయాలు అదుపు చేయాలి. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. ఇష్టకార్యసిద్ధి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయావకాశాలు మెరుగు పడతాయి. కార్యసాఫల్యానికి అనుకూలమైన సమయం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. కుటుంబ సమస్యలు క్రమేపీ తగ్గు ముఖం పడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. శ్రీలక్ష్మి గణపతి ఆలయ దర్శనం శుభకరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇంతా బయటా ఆనందకరమైన పరిస్థితులు నెలకొంటాయి. వస్త్ర ధాన్య సంబంధిత లాభాలు పొందుతారు. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. కుటుంబ విషయాల్లో పట్టువిడుపుల ధోరణిని అవలంబించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మహాలక్ష్మి ధ్యానం శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోగతికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రధాన నిర్ణయాల విషయంలో పెద్దల సూచనలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. ఆదాయంలో వృద్ధి గోచరిస్తోంది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతంగా అమలు చేస్తారు. శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణ ఐశ్వర్యాన్నిస్తుంది.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలు రాబట్టుతారు. ఆర్థిక వ్యవహారాల్లో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. మొహమాటంతో ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. శ్రీ ఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.

కృష్ణాష్టమి స్పెషల్​ "ఛప్పన్​ భోగ్​ మహా నైవేద్యం" - ఈ ప్రసాదం వెనుక ఆసక్తికరమైన పురాణగాథ!

ఆదిశేషుడి అవతారం బలరాముడు- బుధవారం నాడు ఇలా పూజిస్తే ఆరోగ్య ఐశ్వర్యాలు!