ఆ రాశి వారికి నేడు కుటుంబంలో కలహాలు- అనారోగ్య సమస్యలు- ఇష్ట దేవతారాధన శుభకరం!
2026 జులై 3వతేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Published : July 3, 2026 at 12:01 AM IST
Horoscope Today 3rd July 2026 : 2026 జులై 3వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగుతారు. అయితే ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. సహనంతో ఉండాలి. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరమైన చిక్కులు తొలగుతాయి. ఖర్చులను నియంత్రించండి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభకరం.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ప్రతిఫలం ఆనందం కలిగిస్తుంది. అధికారుల ప్రశంసలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. కుటుంబంలో విభేదాలు తొలగి బంధాలు బలపడతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గణపతి దర్శనం శుభకరం.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. ఊహించని ఆర్థిక లాభాలతో ఈ రోజంతా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. ఖర్చులపై నియంత్రణ అవసరం. కుటుంబంలో కలహాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆస్థి, కోర్టు వ్యవహారాలు వాయిదా వేయండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు వ్యాపారులకు చాలా అదృష్టమైన రోజు. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగంలో స్థిరమైన నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. సహచరుల సహకారంతో అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు మీద దృష్టి సారించండి. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా సహనం, పట్టుదలతో ముందుకెళ్తే విజయం మీదే! ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు నియంత్రించడం అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. నవగ్రహాల ధ్యానం మేలు చేస్తుంది.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ఆశించిన ఫలితాలు సిద్దించే వరకు మీ ప్రయత్నాలు ఆపవద్దు. అధిక ఖర్చులతో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఒత్తిడి కలిగిస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు, ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శ్రేయస్కరం.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ ఆశించిన ఫలితాలు రాబట్టుతారు. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఆర్థిక పరమైన చిక్కులు తొలగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయి. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు చేపడతారు. వ్యాపారంలో శుభ ఫలితాలు సాధిస్తారు. ఒక శుభవార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. భూ, ధనలాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. సూర్యారాధనతో విజయం సిద్ధిస్తుంది.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారంలో మిత్రుల సహకారంతో లాభాలు పెరుగుతాయి. మనోబలంతో తీసుకునే నిర్ణయాలతో విజయావకాశాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ముఖ్యమైన పనుల్లో ఆచి తూచి అడుగేయాలి. శుభకార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొంటారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శారీరక శ్రమ పెరిగినప్పటికీ లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన రోజు. వృత్తి పరంగా కీలమైన నిర్ణయాలు తీసుకుంటారు. సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఆర్థికంగా ఒక అనుకూల సంకేతం ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ఉద్యోగంలో పనిఒత్తిడి ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో ఒత్తిడి అధిగమిస్తారు. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. ఖర్చులపై నియంత్రణ సాధిస్తే ఆర్థికంగా మేలు జరుగుతుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శని ధ్యానంతో శుభాలు చేకూరుతాయి.
పాపాలను హరించే శివయ్యకు - ఏఏ అభిషేకాలు చేస్తే ఎలాంటి ఫలితాలు?
గురువారం గురుపూజ ఎందుకు చేయాలి? గురువు విశిష్టత, ఆరాధన వల్ల కలిగే అద్భుత ఫలితాలు!

