ఆ రాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది- శుభవార్తతో మీ ఆనందం రెట్టింపు!
2026 మే 30వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Published : May 30, 2026 at 12:08 AM IST
Horoscope Today 30th May 2026 : 2026 మే 30వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆత్మీయుల సలహాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. సమాజానికి మేలు చేసే పనులు చేపడతారు. ఆధ్యాత్మికపరంగా ఓ మెట్టు పైకి ఎదుగుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభకరం.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి. కుటుంబ వేడుకలు, ఉత్సవాల్లో బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభాలు సంతోషం కలిగిస్తాయి. ప్రయాణాలు ఆహ్లదభరితంగా సాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీహరి ధ్యానం శుభకరం.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. నూతన అవకాశాలు రావడంతో కెరీర్లో దూసుకెళ్తారు. ఉద్యోగంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి. వ్యాపారంలో నష్టభయం ఉండవచ్చు కాబట్టి అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. కుటుంబంలో స్వల్ప వివాదాలు చోటు చేసుకోవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. పట్టుదలతో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో రాజీ ధోరణితో ఉండడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో పట్టుదలతో విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కీలక బాధ్యతలు చేపడతారు. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఉన్నతంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. రక్త సంబంధీకులతో అనుబంధం దృఢ పడుతుంది. ఆర్థికంగా కూడా ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. సంపదలు వృద్ధి చెందుతాయి. సమాజంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తొలగుతాయి. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం ఎంతో మంచిది. ఒక పొరపాటు నిర్ణయం ఇబ్బందులకు గురి చేస్తుంది. కుటుంబ సభ్యులతో సమన్వయ ధోరణితో మెలగడం అవసరం. కుటుంబంలో శాంతికి భంగం కలగకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన ప్రతికూలతలు తొలగిస్తుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. అత్యంత అనుకూలమైన కాలం కొనసాగుతోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరమైన సమయానికి డబ్బు అందుతుంది. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రియమైన వారి సాంగత్యంలో సంతోషంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. మహాలక్ష్మి అష్టకం పఠించడం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేయడానికి మీ శక్తియుక్తులన్నీ ఉపయోగించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అధికారులతో వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో గొడవలు, వాదనలు ఉండవచ్చు కాబట్టి కోపాన్ని అదుపు ఉంచుకోవాలి. అనుకోని ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండండి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ ఆపదలు తొలగిస్తుంది.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవివాహితులు వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మంచిది. కొన్ని ఊహించని ఘటనలు విచారం కలిగిస్తాయి. ఆర్థిక సమస్యలు రాకుండా ఖర్చులు నియంత్రించండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. విఘ్న వినాయకుని ఆరాధన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజంతా ధనలాభాలు, శుభవార్తలతో ఫలవంతం కాబోతోంది. మీ లక్ష్యాలు సునాయాసంగా నెరవేరుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు, పదోన్నతులు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం, మనోబలం పెరుగుతాయి. ఇష్టకార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. శివపంచాక్షరీ మంత్రజపం శ్రేయస్కరం.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి, పనిభారం పెరుగుతాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న పొరపాటుకు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాల విషయంలో స్థిరత్వం అవసరం. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు తెలివిగా నిర్వహించాలి. సంతానం పురోగతి ఆందోళన కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.
పౌర్ణమికి ముందు కుబేర పూజ- ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం!
నరదృష్టి వల్ల ఇబ్బందులా?- ఈ పరిహారాలు చేస్తే సానుకూల ఫలితాలు!

