ETV Bharat / spiritual

ఆ రాశివారికి నేడు ఉద్యోగ వ్యాపారాల్లో విజయావకాశాలు- శత్రువుల మీద విజయం- ఇష్టదేవతారాధన మేలు!

2026 ఆగస్టు 29వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
నేటి రాశి ఫలాలు (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 29, 2026 at 12:00 AM IST

4 Min Read
Choose ETV Bharat

Horoscope Today 29th August 2026 : 2026 ఆగస్టు 29వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు ఆనందకరంగా వుంటుంది. మంచి ఆలోచనా విధానంతో అందరిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. కుటుంబంలో గొడవలు సద్దుమణిగి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా ఉంటాయి. ప్రయాణాల్లో శ్రమ పెరిగినప్పటికీ లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సహచరుల సహకారం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో మనశ్శాంతి చేకూరుతుంది. వ్యాపారంలో ఆర్థిక లాభంతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభకరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శారీరక శ్రమ పెరిగినప్పటికీ సహనంతో వ్యవహరిస్తే విజయావకాశాలు పెరుగుతాయి. ఒక సంఘటనతో మానసికంగా విపరీతమైన ఒత్తిడి వుంటుంది. మనోధైర్యం కోల్పోకుండా చూసుకోండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పెరిగిన ఖర్చులతో ఆర్థిక భారం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శని ధ్యానంతో ప్రతికూలతలు తొలగుతాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే అపజయాలకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీదే! లక్ష్యం నుంచి దృష్టి మరల్చకుండా జాగ్రత్త వహించండి. కొన్ని ఊహించని సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా తొందరపాటు నిర్ణయాలతో నష్టం వాటిల్లుతుంది. కుటుంబ కలహాలు రాకుండా కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. ఒక చిన్న అజాగ్రత్త పరువునష్టానికి దారితీయవచ్చు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. కార్యసిద్ధి హనుమ ఆరాధన ఆపదల నుంచి రక్షిస్తుంది.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. ముఖ్యమైన పనుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విజయం సిద్ధిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. వృథా ఖర్చులు నివారించండి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వాహనయోగం కూడా ఉంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహబలం అనుకూలంగా ఉన్నందున ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన పురోగతి ఉంటుంది. మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. పదోన్నతులకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ ఆంజనేయస్వామి దర్శనం శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట ఖర్చులు, శ్రమ పెరుగుతాయి. ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు అశాంతి కలిగిస్తాయి. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో కలహాలు చికాకు పెడతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అనుకూల నిర్ణయాలు వెలువడుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో మీ కృషికి తగిన లాభాలు లభిస్తాయి. మీ వ్యక్తిత్వాన్ని అందరు ఆదర్శంగా తీసుకుంటారు. పరోపకార కార్యక్రమాలతో సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. కుటుంబంలో శుభాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ దుర్గాదేవి దర్శనం శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ప్రణాళికతో ముందుకెళ్లాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు రాకుండా చూసుకోండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత అన్నివిధాలా సహకరిస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో విజయావకాశాలు పెరుగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. కుటుంబంలో సమస్యలు తొలగి ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభ సమయం నడుస్తోంది. గ్రహాల అనుకూలతతో పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త ప్రాజెక్టులు, వెంచర్లు మొదలు పెట్టడానికి అనువైన రోజు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు అందుకుంటారు. ఆర్ధికంగా ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థికంగా ఒక అనుకూల సంకేతం ఆనందం కలిగిస్తుంది. ప్రియమైన వారితో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గురు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. ధనసంబంధిత వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. కుటుంబంలో కొన్ని సంఘటనలు మనస్థాపం కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో అపోహలు, అపార్ధాలు రాకుండా చూసుకోండి. కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణాలు వాయిదా వేయండి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. శివారాధన శ్రేయస్కరం.

కొల్హాపుర్ మహాలక్ష్మి ఆలయం విశిష్టత- అమ్మవారి ముఖాన్ని తాకే సూర్యకిరణాల వెనుక ఉన్న అద్భుతం ఇదే!

శ్రావణ శుక్రవారం ఈ లక్ష్మీ కుబేర ఆలయాన్ని దర్శిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి!