ETV Bharat / spiritual

ఆ రాశివారికి స్వల్ప అనారోగ్య సమస్యలు- ఆర్థిక ఇబ్బందులు- శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభకరం!

2026 మే 28వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 28, 2026 at 12:01 AM IST

4 Min Read
Choose ETV Bharat

Horoscope Today 28th May 2026 : 2026 మే 28వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. భవిష్యత్తు కోసం ఉన్నతమైన ఆలోచనలు చేస్తారు. బుద్ధిబలంతో వృత్తి పరమైన ఆటంకాలు అధిగమిస్తారు. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడడంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మీ పరోపకార కార్యక్రమాలతో సామాజిక సంబంధాలు మెరుగు పడతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ లలితా సహస్రనామ పారాయణ శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు ఉంటాయి. అధికారుల ప్రశంసలు మీలో నూతనోత్సాహాన్ని నింపుతాయి. మీ సమర్థతను అధికారులు విశ్వసించి పదోన్నతులతో ప్రోత్సహిస్తారు. ఆత్మవిశ్వాసంతో కృషిచేసి వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. కుటుంబ జీవితం సౌకర్యవంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన కోసం తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదుర్కొనే సమర్థత పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు తిరిగి మొదలవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. జీవిత భాగస్వామితో చేసే ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. సూర్యనారాయణ స్వామి ఆరాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెద్దల ఆశీస్సులతో, దైవానుగ్రహంతో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన ప్రగతి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబసభ్యులతో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఆర్థిక నష్టాలు సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. నవగ్రహ స్మరణ శక్తినిస్తుంది.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగంలో కీలక బాధ్యతలు ఆనందంగా స్వీకరిస్తారు. ఆత్మస్థైర్యంతో చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారంలో విజయావకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా ఉన్నతస్థితికి చేరుకుంటారు. ఖర్చులు నియంత్రించండి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ రోజు సంతోషకరంగా సాగుతుంది. ఉద్యోగంలో మీ కృషికి తగిన ఫలితం సంతృప్తి కలిగిస్తుంది. సహచరుల సహకారం, అధికారుల ప్రోత్సాహం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. శుభకార్యాల్లో పాల్గొనడం ఆనందం కలిగిస్తుంది. ఒక సంఘటన మీ మనోబలాన్ని పెంచుతుంది. అవసరమైన సమయంలో అందిన ఆర్థిక సహాయం ఊరట కలిగిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. డబ్బు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన రోజు. మానసిక ఉల్లాసం కలిగించే వార్తలు వింటారు. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల సూచనలకు అనుగుణంగా నైపుణ్యాలు మెరుగు పరచుకుంటే సత్ఫలితాలు పొందవచ్చు. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ మనోబలంతో ముందడుగు వేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో సంయమనం పాటిస్తే బంధాలు బలపడతాయి. కోపావేశాలు నియంత్రించుకోండి. వాహనప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాలు వాయిదా వేయండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. సూర్యాష్టకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శుభసమయం ప్రారంభమైంది. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో స్పష్టమైన విధానంతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో దూరదృష్టితో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. లక్ష్మీకటాక్షంతో సంపద, సుఖజీవనం సిద్ధిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అనారోగ్య సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ప్రియమైనవారితో విహార యాత్రలకు వెళ్తారు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శనం శుభకరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కాలం కొంత ప్రతికూలంగా ఉన్నందున అన్ని విషయాల్లో జాగ్రత్తగా అడుగేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికి సహనంతో ప్రయత్నించాలి. ఆర్థిక విషయాల్లో ఏమరుపాటుతో నష్టం వాటిల్లవచ్చు. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. గత అనుభవంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో శాంతి, సహనం అవసరం. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. హనుమాన్ చాలీసా పారాయణ ఆపదలు తొలగిస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అధికారుల ప్రశంసలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. ధన, స్వర్ణ, వస్త్ర లాభాలు ఆనందం కలిగిస్తాయి. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శ్రేయస్కరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైన స్థిరచిత్తంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. కీలక నిర్ణయాల విషయంలో ఆచి తూచి నడుచుకోవాలి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవచ్చు. సమయానుకూల నిర్ణయాలు మేలు చేస్తాయి. ప్రయాణాల్లో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో ప్రతికూలతలు తొలగుతాయి.

మంగళవారం రాహుకాలంలో దుర్గా పూజ చేస్తే రాహు దోషాలు తొలగుతాయా? - 9 వారాలు చేస్తే రాహు, కుజ దోషాలు దూరం!

మంగళవారం నాడు హనుమాన్ చాలీసా 7 సార్లు పఠిస్తే జరిగే అద్భుతం ఇదే!