ETV Bharat / spiritual

ఆ రాశివారికి అనారోగ్య సమస్యలు- ఆర్థిక ఇబ్బందులు- సూర్య ఆరాధన శ్రేయస్కరం!

2026 ఆగస్టు 27వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
నేటి రాశి ఫలాలు (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 27, 2026 at 12:04 AM IST

4 Min Read
Choose ETV Bharat

Horoscope Today 27th August 2026 : 2026 ఆగస్టు 27వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ప్రణాళికతో వ్యవహరిస్తే విజయం సిద్ధిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలు ఎదురవుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అదుపు తప్పకుండా ఖర్చులు నియంత్రించండి. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం సహకరిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రారంభించిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు నూతన ప్రయత్నాలు వాయిదా వేస్తే మంచిది. శుభకార్యాల్లో స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త మనసుకు ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగి లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ప్రణాళికతో నడుచుకుంటే సత్ఫలితాలు పొందవచ్చు. అవసరానికి సహచరుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికి పట్టుదలతో అధిగమిస్తారు. ఉద్యోగంలో గతంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారుతాయి. ఆర్థికంగా ధనయోగాలున్నాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. మనసుకు సంతోషం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ రోజు మంగళకరంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీరు సాధించిన విజయంతో మీ కీర్తి పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. బంధువులతో అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

కన్య (Virgo) : కన్య రాశి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. సహనంతో ఉండాలి. ఆర్థిక సమస్యలు రాకుండా ఖర్చులు అదుపు చేయండి. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉంటుంది. మాటల్లో సంయమనం పాటిస్తే బంధాలు బలపడతాయి. ప్రయాణాలు అనుకూలం కాదు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభ సమయం నడుస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీ కృషికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. సమాజంలో విశేషమైన కీర్తి గడిస్తారు. సోదరులతోనూ, రక్తసంబంధీకులతో అనుబంధం దృఢ పడుతుంది. ఒక తీర్థయాత్ర ఉండవచ్చు. విదేశాల నుంచి శుభవార్త అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు ఆనందం కలిగిస్తాయి. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. మీ అంచనాలకు మించిన ధనలాభాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోండి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సిద్ధి గణపతి దర్శనం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ సహనంతో ఉంటే పరిష్కారం అవుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. శ్రీ గురు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ శుభకరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కావాలంటే పట్టుదల, ఏకాగ్రత అవసరం. ఉద్యోగంలో వేసే ప్రతి అడుగు అలోచించి వేయాలి. వ్యాపారంలో అనుభవంతో తీసుకున్న నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం. కుటుంబ వ్యవహారాల్లో సహనం, ఓర్పు అవసరం. పుణ్యక్షేత్రాల సందర్శనతో ప్రశాంతత పొందవచ్చు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ హోదా పెరుగుతుంది. పదోన్నతులతో బాధ్యతలు పెరుగుతాయి. ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త వహించండి. ఆర్థికంగా విశేషమైన పురోగతి సాధిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. సమాజంలో మీ ప్రతిష్ట, ప్రజాదరణ పెరగవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులు ఆహ్లాదకరంగా, అనుకూలంగా ఉంటాయి. ఉన్నతాధికారులు మీ పనితీరుకు సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పితృవర్గం, పెద్దల నుంచి లాభాలు, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఖర్చులు నియంత్రించడం మంచిది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆత్మీయలతో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.

పూజగదిలో ఈ దేవుళ్ల ఫొటోలు ఉండకూడదట! - ఎందుకో తెలుసా?

అమ్మవారికి నిమ్మకాయల దండ ఎందుకు వేస్తారు? దుర్గాదేవి ఆరాధనలో దీనికున్న ప్రత్యేకత ఏమిటి?