ఆ రాశివారికి వ్యాపారాల్లో లాభాలు- ఆరోగ్యం విషయంలో జాగ్రత్త- శివారాధన శ్రేయస్కరం!
2026 జులై 22వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Published : July 22, 2026 at 12:02 AM IST
Horoscope Today 22nd July 2026 : 2026 జులై 22వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ముఖ్యం. ఆర్థిక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆవేశం తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఈ రోజు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆంజనేయస్వామి దర్శనం శుభకరం.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఉద్యోగంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే అప్పుల బాధ ఉండదు. అవసరానికి ధనసహాయం లభిస్తుంది. ఆత్మీయులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. అవమానకర సందర్భాలకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గతంలో తప్పులు పునరావృతం కాకుండా చూసుకోండి. ఉద్యోగంలో అధికారులతో సౌమ్యంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదురుకావచ్చు. సహనం, శాంతంతో ప్రయత్నించాలి. మితిమీరిన ఖర్చులతో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. కుటుంబ సభ్యులతో సామరస్యంగా వ్యవహరించడం వలన శాంతి నెలకొంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశాజనకమైన పరిస్థితులు నెలకొంటాయి. ప్రారంభించిన పనుల్లో గొప్ప సంకల్ప బలంతో విజయం సాధిస్తారు. వ్యాపారులు తమ పోటీ దారులపై విజయం సాధిస్తారు. భూ, గృహ, ధనలాభాలు ఉంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ రోజు మంగళకరమైన రోజు. ఉద్యోగంలో కీర్తి, గౌరవం పెరుగుతాయి. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. మీ వాక్చాతుర్యంతో మీ పరిసరాల్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రెట్టించిన ఆత్మ విశ్వాసంతో ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. మీరు సాధించిన విజయాలతో సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. ఒక తీర్థయాత్రకు అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే సూచన ఉంది. వ్యాపారంలో ఆటంకాలు తొలగి పనులు సాఫీగా సాగుతాయి. ఒక వ్యవహారంలో పెద్ద మొత్తంలో ధనలాభం అందుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభకరం.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు ఈ రోజు లాభదాయకమైన రోజు. ఆదాయంలో వృద్ధి ఉండడంతో ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబజీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. స్నేహితులతో విహారయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి లోపిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవడంతో నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోండి. వివాదాలు, ఘర్షణలకు దూరంగా ఉండండి. కుటుంబ కలహాలు అశాంతి కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభను పలువురు ప్రశంసిస్తారు. వ్యాపారాభివృద్ధికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మీ సంతోషాన్ని పంచుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం, శ్రమ పెరుగుతాయి. సమతుల్యత పాటిస్తూ ముందుకు సాగడం వలన మేలు జరుగుతుంది. మితవ్యయం పాటిస్తే ఆర్థికంగా భారం ఉండదు. కుటుంబ సభ్యులతో, బంధువులతో సమస్యలు రాకుండా కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరి. హనుమాన్ చాలీసా పారాయణతో ప్రతికూలతలు తొలగుతాయి.
శనివారం హనుమంతుడిని ఎందుకు పూజించాలి? శని బాధలు తొలగించే శనివార వ్రతం విశిష్టత ఇదే!
పవర్ఫుల్ శివక్షేత్రం- ఒక్కసారి పూజ చేస్తే రాహు, కేతువులు దోషాలు పోవడం- సంతానం కలగడం ఖాయం!

