ఆ రాశివారికి వృత్తి పరంగా విశేష ధనలాభాలు- శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం!
2026 జూన్ 11వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Published : June 11, 2026 at 12:00 AM IST
Horoscope Today 11th June 2026 : 2026 జూన్ 11వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఒత్తిడి కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక వ్యవహారాలు చక్కబెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శనం శుభకరం.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సూచనలు పాటిస్తే మేలు జరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, ఆనందం ఉంటాయి. నూతన వస్తువాహన యోగం ఉంది. ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ అభయ అంజననేయ స్వామి దర్శనం శుభకరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మీ ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు మేలు చేస్తాయి. ఆర్థికంగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్థిరమైన నిర్ణయాలతో వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఒక శుభవార్త మీ కుటుంబంలో ఆనందం నింపుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. దుర్గాదేవి ధ్యానం శక్తినిస్తుంది.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలతో వృత్తి వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా ఏకాగ్రతతో పనిచేస్తే మేలు జరుగుతుంది. బంధువులతో మిత సంభాషణ ఉత్తమం. ప్రయాణాలు లాభదాయకం. శివారాధన మనశ్శాంతినిస్తుంది.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఆశించిన ఫలితం అందుకుంటారు. వ్యాపారంలో పురోగతి కోసం గట్టి ప్రయత్నాలు చేయాలి. సమష్టి నిర్ణయాలతో ముందుకెళ్తే మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలు, ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభ సమయం నడుస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో విజయపరంపర కొనసాగుతుంది. అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. వృత్తి పరంగా విశేష ధనలాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో మీకు అనుకూల ఫలితాలు వెలువడుతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు ఎదురవుతాయి. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఆర్థికంగా పూనుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు చేసే సత్కార్యాలతో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. గణపతి దర్శనం ప్రశాంతతనిస్తుంది.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. పనిప్రదేశంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల మోసపూరిత మాటలకు ప్రభావితం కావద్దు. మొహమాటంతో చిక్కుల్లో పడతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. పెరిగిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబ సమస్యలు శాంతంగా పరిష్కరించుకుంటే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగుతాయి.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆధ్యాత్మికంగా మీరు చేపట్టే సత్కార్యాలతో మీ గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభకరం.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరిగినప్పటికీ ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ప్రయాణాలు ఫలప్రదం అవుతాయి. వృథా ఖర్చులు నివారించండి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గ్రహాల అనుకూలతతో ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త అందుకుంటారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కనకధారా స్తోత్ర పారాయణం శుభకరం.
కుంభకోణం చుట్టూ నవగ్రహ దేవాలయాలు - గ్రహ దోషాలను తొలగించే 9 మహా క్షేత్రాలు!
రావి చెట్టును ఎలా పూజించాలి? శని దోషాలను తొలగించే అశ్వత్థ వృక్ష మహిమ గురించి తెలుసా?

