పుణ్యక్షేత్రాల్లో "తలనీలాలు" ఎందుకు సమర్పించాలి? - దీని వెనుక ఉన్న 'రహస్యం' ఏంటో తెలుసా?
దేవుడికి 'తలనీలాలు' సమర్పించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? - ఆధ్యాత్మికవేత్త శ్యామలానంద ప్రసాద్ వివరిస్తున్నారిలా!

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 7, 2026 at 3:02 PM IST
Devotees Offer Hair at Pilgrimage Sites Reasons : భారతదేశంలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అయితే, చాలా మంది భక్తులకు పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు తలనీలాలు సమర్పిస్తారు. చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీస్తారు. అసలు, దేవుడికి తలనీలాలు సమర్పించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? దీనిపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ఇలా వివరణ ఇస్తున్నారు.
మన పాపాలన్నీ తల వెంట్రుకలలో ఉంటాయట. కాబట్టి, వాటికి వారానికోసారి సున్నిపిండి, ఇతర ఆయిల్స్ పెట్టి అభ్యంగనస్నానం చేసినప్పటికీ పాపములతో నిండినటువంటి వెంట్రుకలను భగవంతుడికి అర్పించడం ద్వారా అహంకారాన్ని వదిలివేసినట్లుగా చెబుతుంటారంటున్నారు ఆధ్యాత్మికవేత్త పాలపర్తి శ్యామలానంద ప్రసాద్. అలాగే, వెంట్రుకలు అనేవి కల్మషానికి, మురికికి కేంద్రం. కాబట్టి, వీటన్నింటిని తొలగించుకోవడానికి మనకు ఒక ఇష్టదైవం సన్నిధానంలో తలనీలాలు సమర్పించడం ద్వారా బుద్ధి, జ్ఞానం వంటివి సిద్ధిస్తాయంటున్నారు. అలాగే, పితృ కార్యాల్లోనూ అంటే ఎవరైనా మరణిస్తే వారి పిల్లలు, వారి అన్నదమ్ములు తల వెంట్రుకలు తీసేయాలని చెబుతారు.
మనం భగవంతుడిని ఏదైనా కోరిక కోరినప్పుడు అది నెరవేరితే తలనీలాలు సమర్పిస్తుంటాం. ఇలా ఎందుకు చేస్తారంటే, తలనీలాలు ఇవ్వడం అంటే అహంకారం పోయి వినయం వచ్చేసిందన్నమాట. మామూలుగా చాలా మంది జుట్టు మీద ఎవరూ చేయి వేయడానికి వీల్లేదని అంటుంటారు. అయితే, తల వెంట్రుకలు పాపములకు నిలయం అని చేయడం వల్ల ఇప్పుడు వైద్యశాస్త్రం కూడా తల బరువు వదలాలన్నా, తలకు ఉండే వ్యాధులు తగ్గాలన్నా, హ్యుమిడిటీ కూడా నెత్తి మీద ఎక్కువకాలం ఉండకూడదని చెబుతుంది. పూర్వం మన సంప్రదాయం కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. తల నిండా వెంట్రుకలు ఉంచడం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే తప్ప, పురుషులకు ఉంచేవారు కాదు. పురుషులందరికీ మెదడుకి రక్షణగా కేవలం శిఖ మాత్రమే ఉంటుండేది. ముందు మొత్తం ఖాళీగా ఉండేది. దీన్నే "గుడిసె బెండు హెయిర్ క్రాప్" అనే పేరుతో పిలిచేవారు. తల మీద ఎక్కువభాగం వెంట్రుకలు ఉన్నట్లయితే దాని వల్ల అందులో సూక్ష్మజీవులు చేరడం, వేరే క్రిమీకీటకాలు చేరడం, అనేక రకాలైనటువంటి నష్టాలుంటాయంటున్నారు.
"పూజ" చేసేటప్పుడు నేల మీద కూర్చోకూడదంటారు ఎందుకు? - మరి ఎలా చేస్తే మంచి ఫలితాలు?
జుట్టు కేవలం అలంకారం, ఆకర్షణ. ఇటువంటి వాటి వల్ల కూడా జీవన విధానం దెబ్బతింటుందనే ఉద్దేశంతో చెప్పినవాటిని భగవదర్పణం చేయడమే దాని ఉద్దేశంగా కొన్ని కొన్ని ప్రదేశాల్లో పుట్టు వెంట్రుకలుగా తీసేస్తారని చెబుతున్నారు. పుట్టినప్పుడు వచ్చిన ఆ వెంట్రుకలు తీసేస్తే కానీ తర్వాత వచ్చే వెంట్రుకల స్వరూపం మారుతుంది. అలాకాకుండా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అట్టిపెడితే ఎట్లా ఉంటాయనేవారు. కాబట్టి, పుట్టు వెంట్రుకలు, తలనీలాలు తీసేయడం వంటివన్ని కూడా మన వ్యక్తిత్వాన్ని సరిచేయడానికి, మనలో ఉండే అహంకారాన్ని పోగొట్టడానికి, ఆరోగ్యాన్ని కాపాడడానికి తీసుకొచ్చిన కార్యక్రమాలని చెబుతున్నారు. కాబట్టి, కొంతమంది కొన్ని కొన్ని ప్రత్యేక దేవస్థానాలలో తలనీలాలు, పుట్టు వెంట్రుకలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం ఎందుకంటే మన అహంకారం అక్కడ సమర్పణ చేసి, ఆరోగ్యాన్ని తెచ్చుకోవడంగా చెబుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పాలపర్తి శ్యామలానంద ప్రసాద్.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
పూజగదిలో 'వీటిని' ఉంచకండి! - మనసంతా కేంద్రీకరించాలంటే ఏం చేయాలో తెలుసా?
"జాతకం" ఎప్పుడు చూపించుకోవాలి? - ఇదే సరైన సమయం అంటున్న జ్యోతిష్యులు!

