ETV Bharat / snippets

తల్లికి వందనంపై మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైఎస్సార్​సీపీ నేతలకు కోపం ఎందుకు?: షర్మిల

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 9:54 PM IST

sharmila_on_ysrcp_leaders
sharmila_on_ysrcp_leaders (ETV Bharat)

YS Sharmila on YSRCP Leaders Bad Propaganda: తల్లికి వందనం పథకంపై వైఎస్సార్​సీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. తల్లికి వందనం ఉత్తర్వులపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైఎస్సార్​సీపీ నేతలకు అసహనం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ తోకపార్టీ అంటూ వ్యాఖ్యలు చేయటం వారి అవగాహనా రాహిత్యం అంటూ పేర్కొన్నారు. వైఎస్సార్​సీపీ నేతల వ్యాఖ్యలు చూస్తే పచ్చకామెర్ల సామెత గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీడియా సమావేశం వల్లే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనంపై వివరణ ఇచ్చుకుందని వెల్లడించారు. 2019 ఎన్నికల ముందు జగన్ ఇంట్లో ఇద్దరు బిడ్డలకు అమ్మఒడి ఇస్తామని చెప్పలేదా అని ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్​సీపీ కోసం బైబై బాబు అనే ప్రచారంతో పాటు అమ్మఒడి కింద ఇద్దరు బిడ్డలకు 15వేల చోప్పున సాయమని కూడా తాను ప్రచారం చేశానని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.