Tribal Boy Dies with Snake Bite in Nellore District : నెల్లూరు జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. జలదంకి మండలం తిమ్మసమముద్రంలోని గిరిజన కాలనీకి చెందిన దుర్గాప్రసాద్ (13) బహిర్భూమికి వెళ్లినప్పుడు పాము కాటుకు గురయ్యాడు. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలుడిని చికిత్స నిమిత్తం కావలికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. నిరుపేద గిరిజన కుటుంబంలో ఈ దుర్ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. నిరుపేద కుటుంబమైన గిరిజన దంపతులను ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
పాము కాటుకు గిరిజన బాలుడు మృతి - గ్రామంలో విషాదఛాయలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 10, 2024, 7:32 PM IST