Doctor Irregularities in the Attendance register : పంద్రాగస్టున రిజిస్టర్లో చేయాల్సిన సంతకాన్ని ఒక రోజు ముందే ఓ ప్రభుత్వ డాక్టరమ్మ చేసింది. స్థానికుల వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం పెంచికల్ దిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సీతామహాలక్ష్మి రేపటి హాజరును ఈ రోజే చేసేసింది.
తాను సంతకం చేయడమే కాకుండా ఇరువురు సిక్ లీవ్ ఉన్నట్లు నమోదు చేయడం విశేషం. మధ్యాహ్నం మూడు గంటలకు సంతకం చేసి వెళ్లినట్లుగా సమాచారం. గతంలో ఆమెకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చిన కూడా ఆమె తీరు మాత్రం మారలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో అక్కడ పని చేసిన డాక్టర్ల కంటే భిన్నంగా రోగులను పట్టించుకోకుండా ఉండటం, భాద్యతలు సక్రమంగా నిర్వర్తించకపోవడం వంటి ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. పేద ప్రజలకు సేవలు చేయలేని డాక్టర్ను తొలిగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.