Ramapuram Road Accident Today : అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామాపురం మండలం మేదరపల్లి చెక్‌పోస్టు వద్ద ఇవాళ తెల్లవారు జామున వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును కడప నుంచి రాయచోటి వైపు సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Road Accident in Annamayya District : ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కడప, రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు రోడ్డుకు అడ్డంగా పడిన వాహనాలతో కడప-రాయచోటి మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. జేసీబీ సహాయంతో వాహనాలు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.