Resident of YSR District Was Murdered in Gulf : వైఎస్సార్ జిల్లా వాసి గల్ఫ్‌లో హత్యకు గురయ్యాడు. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గిలేటి పల్లెకు చెందిన నాగేంద్ర జీవనోపాధి కోసం ఏడాదిన్నర కిందట కువైట్‌కు వెళ్లారు. గత 15 రోజులుగా నాగేంద్ర దగ్గర నుంచి ఇంటికి ఫోన్ కూడా రాలేదు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి నాగేంద్ర ఆచూకీ కోసం ఏజెంట్లను సంప్రదించారు. నాగేంద్ర హత్యకు గురయ్యాడని అక్కడి అధికారులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నాగేంద్ర హత్యపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాధితుడి మృతదేహం రేపు స్వగ్రామానికి రానుంది.
ఏడాదిన్నర క్రితం ఎడారి దేశానికి-నేడు మృత దేహంగా స్వగ్రామానికి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2024, 1:32 PM IST