Rare Frog in Nirmal : కడెం అడవుల్లో అటవీ శాఖ అధికారులు గస్తీ కాస్తున్న సమయంలో అరుదైన కప్పను గుర్తించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ రేంజ్ పరిధిలోని పెద్దవాగు పరిసరాల్లో మంగళవారం అటవీ అధికారులు ప్రకాష్, ఎఫ్‌బీఓ ప్రసాద్‌లు గస్తీ తిరుగుతుండగా అరుదైన జాతి రకానికి చెందిన కప్పను కనిపిస్తే ఫొటోలు తీశారు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో ఉన్న అధికారులు పరీక్షించి ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్, శ్రీలంక బుల్‌ఫ్రాగ్ పేర్లతో పిలిచే కప్ప జాతిగా గుర్తించారు.
Rare Frog in Kadem Forests : పెయింటెడ్ ఫ్రాగ్ కప్పలు వేసవిలో చల్లని ప్రదేశాల్లో నేల లోపలి భాగంలో వర్షాకాలం ప్రారంభంలో బయటకి వచ్చి గుడ్లు పెడతాయని అధికారులు తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతం, జీవవైవిధ్యం ఉన్నచోటనే ఇవి జీవిస్తాయని వివరించారు. మొదటిసారి కవ్వాల్ అటవీ ప్రాంతంలో ఈ రకమైన కప్పను గుర్తించామని వెల్లడించారు.