ETV Bharat / snippets

బస్టాండ్​లో ఇద్దరు చిన్నారులను వదిలివెళ్లిన అపరిచితులు - చైల్డ్​హెల్ప్​లైన్​ సిబ్బందికి అందజేత

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 4:51 PM IST

Parents leave child In Bus stop
Parents leave child In Bus stop (ETV Bharat)

Parents leave child In Bus stop : అభం శుభం తెలియని ఇద్దరి పిల్లలను గుర్తుతెలియని వ్యక్తులు ప్రయాణ ప్రాంగణంలో వదిలివెళ్లిన అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లాలోని పటాన్​చెరులో చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారులను చైల్డ్​లైన్​ సిబ్బందికి అప్పగించారు.

పటాన్​చెరు ప్రయాణ ప్రాంగణంలో ఇద్దరు చిన్నారులు ఒంటరిగా ఉండటాన్ని స్వీపర్లు గమనించారు. ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా వస్తారేమో అని చూసినప్పటికీ ఫలితం లేకపోవడంతో వారు పటాన్​చెరు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని నాలుగేళ్ల వయసున్న బాబు, ఏడాది వయసున్న పాపను పోలీస్​స్టేషన్​కు తరలించారు. వారి తల్లిదండ్రుల వివరాల కోసం ప్రయత్నించినప్పటికీ లభ్యం కాలేదు. దీంతో చైల్డ్​​హెల్ప్​లైన్​కు అధికారులు సమాచారం ఇచ్చి వారికి అప్పగించినట్లు పటాన్​చెరు సీఐ ప్రవీణ్​కుమార్​ రెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.