Nagarjuna Sagar Dam Closed : నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం సోమవారం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లను మూసివేశారు. అంతకముందు ఉదయం 18 గేట్ల ద్వారా కొనసాగిన నీటి విడుదల క్రమంగా అధికారులు గేట్లను తగ్గిస్తూ 10 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. మళ్లీ 6 గేట్ల తరువాత 2 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. తాజాగా మొత్తం గేట్లను మూసివేశారు.
ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా దాదాపు 30 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 588.60 అడుగులు ఉంది. సాగర్ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 307.87 టీఎంసీలు ఉంది. నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,25,171 క్యూసెక్కుల నీరు ఉంది.