Murder in Bapatla Suryalanka Beach: బాపట్లలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం సందర్శకులతో సందడిగా ఉండే సూర్యలంక బీచ్‌లో దారుణ హత్య కలకలం రేపింది. ఏసుబాబు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. సూర్యలంక తీరంలో అతని మీద దాడి చేయగా, ద్విచక్ర వాహనంపై ఓ షాపు ముందుకు వచ్చి పడిపోయాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ ప్రాణం వదిలాడు. అంబులెన్స్‌కు స్థానికులు ఫోన్ చేసినా సకాలంలో స్పందించలేదని అక్కడ ఉన్నవారు ఆరోపించారు. అంబులెన్స్ వచ్చే సమయానికి అతను ప్రాణాలు వదిలాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ జరుగుతుందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. కళకళలాడే సూర్యలంక బీచ్‌లో దారుణంగా హత్య జరగటంతో పర్యాటకులంతా భయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.
బీచ్‌లో దారుణం - ఓ వ్యక్తి గొంతు కోసి పరారైన దుండగులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2024, 7:28 PM IST
|Updated : Sep 16, 2024, 9:23 PM IST