National Award For Telangana Weaver : తెలంగాణ చేనేత కళాకారుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం గ్రామానికి చెందిన కర్నాటి ముకేశ్ జాతీయ చేనేత పురస్కారాన్ని పొందారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.ముకేశ్ రెండేళ్ల పాటు శ్రమించి వంద రకాల డిజైన్లతో సహజ సిద్దమైన 10 రంగులతో డబుల్ ఇక్కత్ నూలు చీరను నేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మగ్గంపై ఒక్కో పోగును అల్లుతూ 46 అంగుళాల వెడల్పు, ఏడు మీటర్ల పొడవుతో 600 గ్రాముల బరువుండే చీరను తయారుచేశారు . కేంద్ర చేనేత, జౌళిశాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేయగా వారిలో తెలంగాణ నుంచి ముకేశ్ అవార్డు సాధించారు.
తెలంగాణ చేనేత కళాకారుడికి జాతీయ పురస్కారం
Published : Aug 8, 2024, 12:12 PM IST