Minister Gottipati Ravi Kumar Fire on YS Jagan : అంబేడ్కర్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఫేక్ ప్రచారాలతో వైఎస్సార్సీపీ బుద్ధి మరోసారి బయటపడిందని విమర్శించారు. గత ఐదేళ్లలో నా ఎస్సీలు అని పదే పదే చెప్పడం తప్ప దళితులకు చేసింది శూన్యమన్నారు. జగన్ ప్రభుత్వంలోనే దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్‌ను పొట్టన పెట్టుకున్నది జగన్ ప్రభుత్వమని దుయ్యబట్టారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసింది వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కాదా అని ప్రశ్నించారు.
జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు: మంత్రి గొట్టిపాటి రవి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 14, 2024, 7:55 PM IST