ETV Bharat / snippets

సిక్కోలు వీరుడికి కీర్తిచక్ర - రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 10:42 AM IST

Kirti_Chakra_Award_to_Major_Malla_Ramagopal_Naidu
Kirti_Chakra_Award_to_Major_Malla_Ramagopal_Naidu (ETV Bharat)

Kirti Chakra Award to Major Malla Ramagopal Naidu: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్‌ మళ్ల రామగోపాల్‌ నాయుడిని ప్రతిష్ఠాత్మకమైన కీర్తిచక్ర పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవాళ ఆయన పురస్కారం అందుకోనున్నారు. ఈ పురస్కారానికి ఎంపికైన నలుగురిలో రామ్‌గోపాల్‌ ఒక్కరే సజీవంగా ఉన్నారు.

2012లో సైన్యంలో చేరిన ఆయన 2023 అక్టోబరు 26న కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన ఆకస్మిక పార్టీకి నాయకుడిగా వ్యవహరించారు. ఉదయం 10.10సమయంలో ఓ జవాను ఐదుగురు ఉగ్రవాదులను గమనించి రామ్‌గోపాల్‌కి తెలియజేయగానే దాడి ప్రారంభించారు. భీకర కాల్పుల మధ్య జవాన్లతో కలిసి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఓ ఉగ్రవాది రామ్‌గోపాల్‌ బృందంపై గ్రెనేడ్‌ విసరగా తప్పించుకుని, అతడినీ హతమార్చి ఆపరేషన్‌ ముగించారు. ఈ పోరాటంలో వెంట ఉన్న సైనికులను రక్షించుకోవడంతో పురస్కారం లభిస్తోందని రామ్‌గోపాల్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.