ETV Bharat / snippets

కేబీఆర్ పార్కులో హోంగార్డు అరాచకం - ప్రేమజంటలే లక్ష్యంగా వసూళ్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 2:33 PM IST

Updated : Aug 7, 2024, 7:00 PM IST

Home Guard Arrested
Home Guard Arrested In HYderabad (ETV Bharat)

Home Guard Arrest In Hyderabad : హైదరాబాద్​లోని కేబీఆర్ పార్కు ముందున్న జీహెచ్ఎంసీ నడకదారిలో యువతీయువకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న హోంగార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ ఉద్యానవనం వద్ద పెట్రోలింగ్ వాహనంలో ముద్దం శ్రీనివాస్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. యాదగిరి అనే వ్యక్తిని సహాయకుడిగా పెట్టుకున్నాడు. నడకదారిలో యువతీయువకులు జంటగా కనిపిస్తే తనకు సమాచారం ఇవ్వాలని అతడికి చెప్పాడు

యాదగిరి ప్రేమజంటలు కనిపించగానే హోంగార్డుకు సమాచారం ఇస్తాడు. అప్పుడు శ్రీనివాస్ వాళ్ల వద్దకు వెళ్లి బెదిరించి డబ్బు వసూలు చేస్తాడు. ఇటీవల ఓ జంటను డబ్బివ్వాలని బెదిరించగా, అతడు తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. అయితే ఏటీఎంలో డ్రా చేసి ఇవ్వాలని యువకుడిని బలవంత పెట్టడంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని హోంగార్డుతో పాటు అతడి సహాయకుడిని అరెస్ట్ చేశారు.

Last Updated : Aug 7, 2024, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.