Hyderabad Constable Death : ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శేఖర్ పుట్టినరోజు వేడుకకు హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ సహా 30 మంది స్నేహితులు వెళ్లారు. ఆదివారం రాత్రి బర్త్‌డే పార్టీలో డిన్నర్ చేస్తున్న సమయంలో కానిస్టేబుల్ డేవిడ్ మూడో అంతస్తు నుంచి కిందికి పడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు 194 బీఎన్‌ఎస్‌ఎస్ కింద కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
బర్త్‌డే పార్టీలో విషాదం - భవనం పైనుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి
Published : Aug 5, 2024, 5:50 PM IST