Sangam in Nellore:నెల్లూరు సంగం లో వినాయక నిమజ్జనోత్సవం లో వివాదం చోటుచేసుకుంది. స్థానిక తూర్పు వీధికి చెందిన వినాయకుడి విగ్రహం శివాజీ సెంటర్ కి రాగానే అక్కడి మహిళలు వారిని డిజే సౌండ్ తగ్గించమని అడిగినందుకు వివాదం చెలరేగింది.ఈ విధంగా అడిగినందుకు ఆగ్రహంతో ఊగిపోయిన యువకులు ఆవేశంతో మూకుమ్మడిగా ఇద్దరు మహిళల పై విచక్షణారహితంగా దాడి చేశారు.దీంతో మహిళలకు తీవ్ర గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనపై స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.
డీజే సౌండ్‌పై వివాదం-మహిళలపై దాడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2024, 1:25 PM IST