ETV Bharat / snippets

పార్టీలు మారిన ఎమ్మెల్యేల వల్ల మాకు ఎలాంటి నష్టం లేదు : పాడి కౌశిక్​​ రెడ్డి

BRS MLA Padi Kaushik Reddy On Party Jumpings in Telangana
BRS MLA Padi Kaushik Reddy On Party Jumpings in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 2:25 PM IST

BRS MLA Padi Kaushik Reddy On Party Jumpings in Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ప్రజాక్షేత్రంలో సత్తా చాటుకోవాలని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కౌశిక్​​ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్​ భవన్​లో మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి దానం నాగేందర్ మాజీ సీఎం కేసీఆర్​తో పాటు ఆ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్​ని విమర్శించే స్థాయి దానంకు లేదని మండిపడ్డారు. స్వార్థంతో పార్టీలు మారిన ఎమ్మెల్యేల వల్ల తమకు నష్టం లేదని కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో 2019లో 23 సీట్లకు పరిమితమైన టీడీపీ నేడు భారీ మెజారిటీతో అధికారంలోక వచ్చిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ సైతం అదేవిధంగా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.