Srinivs Goud On Dairy Farmers Problems : తెలంగాణ పాడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, 4 నెలల నుంచి వారికి డబ్బులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. డబ్బులు అందక పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో పాడి రైతులకు 15 రోజులకు ఒకసారి డబ్బులు చెల్లించే విధానం ఉండేదని గుర్తు చేశారు. పాడి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని, లేదంటే పాడి రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్లో రోజూ వినియోగించే 30 లక్షల లీటర్ల పాలలో తెలంగాణ పాడి రైతుల వాటా ఐదు లక్షల లీటర్లు అయితే, ఆ పాలు సరఫరా చేసే రైతులకు డబ్బులు చెల్లించడం లేదన్నారు. విజయ డెయిరీలో రూ.500 కోట్ల మేర విలువైన పాల ఉత్పత్తులు నిల్వ ఉన్నాయని, వాటిని కనీసం యాదాద్రి దేవస్థానానికో లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికో విక్రయిస్తే బాగుంటుందని సూచించారు.