Bridge Suddenly Collapsed in YSR District : వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల కలసపాడు ప్రధాన రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు జ్యోతి క్షేత్రం వెళ్తుండగా శంఖవరం వద్ద వంతెన మధ్యభాగం ఒక్కసారిగా కుంగింది. కుంగివ వంతెన గుంతలో బస్సు చక్రం చిక్కుకుంది. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 20 ఏళ్ల కిందట నిర్మించిన ఈ వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వంతెనపై శాశ్వత మరమ్మతులు చేపట్టకుండా తారు వేశారు. అధికారులు ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కలసపాడు రహదారిపై కుంగిన కల్వర్టు- డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 12:09 PM IST