Vinesh Phogat Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్‌లో భారత స్టార్ వినేశ్ ఫొగాట్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మంగళవారం గూజ్మన్ (క్యూబా)తో సెమీఫైనల్లో తలపడ్డ వినేశ్ 5-0 తేడాతో నెగ్గింది. దీంతో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. కాగా ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో ఫైనల్ చేరుకున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో వినేశ్ గెలిస్తే భారత్ ఖాతాలో పసిడి చేరుతుంది.
కాగా, ఈ విశ్వక్రీడల్లో సోమవారమే వినేశ్ ప్రీ క్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడింది. వరుస మ్యాచ్‌ల్లో సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది. వినేశ్ ప్రీ క్వార్టర్స్‌లో వరల్డ్ నెం.1 సుసాకీ (జపాన్)ను 3-2తో, క్వార్టర్స్‌లో లివచ్ ఒక్సానా (ఉక్రెయిన్)పై 7-5 తేడాతో నెగ్గింది.