ETV Bharat / snippets

క్వార్టర్స్​లో డీలా పడ్డ రీతికా- టాప్​ సీడ్​పై పోరాడి ఓడిన రెజ్లర్

author img

By ETV Bharat Sports Team

Published : Aug 10, 2024, 3:59 PM IST

Reetika Hooda Paris 2024
Reetika Hooda Paris 2024 (Source: Associated Press)

Reetika Hooda Paris 2024: పారిస్ ఒలింపిక్స్​లో రెజ్లర్ రీతికా హుడా క్వార్టర్ ఫైనల్స్​లో ఓడింది. శనివారం జరిగిన మహిళల ఫ్రీస్టైల్ (76 కేజీలు) క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో టాప్ సీడ్ ఐపెరి మెడెట్ కైజీ (కిర్గిస్థాన్‌) చేతిలో ఓడిపోయింది. అయితే పారిస్​ ఒలింపిక్స్​లో రీతికా పోరాటం అప్పుడే ముగియలేదు. ఐపెరి కైజీ ఫైనల్​కు అర్హత సాధిస్తే, రీతికా రెపిచేజ్ రౌండ్ ఆడే ఛాన్స్​ ఉంటుంది.

కాగా, అంతకుముందు జరిగిన ఫ్రీ స్ట్రైల్ 76కేజీల విభాగం రౌండ్ 16లో రీతిక నెగ్గింది. ఆమె 8వ సీడ్ బెర్నాడెట్ నాగి (హంగేరీ)పై 12-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్​కు అర్హత సాధించింది. కానీ, తాజాగా క్వార్టర్స్​లో నిరాశ పర్చింది. ఇక ప్రస్తుత ఒలింపిక్స్​లో భారత్ ఖాతాలో 6 పతకాలు ఉన్నాయి. అందులో ఒకటి రజతం, మిగిలిన 5 కాంస్యాలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.