Paris Olympics 2024 Eight Athletes Chandigarh University : ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ 2024 మరో 10 రోజుల్లో ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ మెగాటోర్నీ కోసం అన్నీ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత బృందంలో ఒకే యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఉండటం విశేషం. చంఢీగడ్ యూనివర్సిటీకి ఈ అరుదైన అవకాశం లభించింది.
ఎవరెవరంటే? - అర్జున్ బబుటా(షూటింగ్), భజన్ కౌర్(ఆర్చరీ), రితిక హుడా (రెజ్లింగ్), సంజయ్ (హాకీ), అక్ష్‌దీప్ సింగ్ (రేస్ వాకింగ్), యశ్ (కయాకింగ్)లతో పాటు పారాలింపియన్లు పలక్ కోహ్లీ (బ్యాడ్మింటన్), అరుణ తన్వర్ (తైక్వాండో) చంఢీగడ్కు చెందిన విద్యార్థులు. వీరంతా ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్, రాజ్యసభ ఎంపీ సత్నామ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.