Olympics Gold Medal Content : ఒలింపిక్స్‌లో విజేతలకు బహుకరించే స్వర్ణ పతకం నిజమైన బంగారందేనా అని అందరికీ డౌట్ ఉంటుంది. అయితే ఈ మెడల్‌ను బంగారంతో చేయరు. వెండితో రూపొందిస్తారు. పైన మాత్రమే బంగారు పూతను పోస్తారు. సాధారణంగా ఈ మెడల్ తయారీలో 92.5 శాతం వెండి, 6 గ్రాముల బంగారాన్ని వినియగిస్తారు.
ఇక 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఈ మెడల్ విలువ సుమారు రూ.62 వేల - రూ.71 వేల మధ్య ఉంటుంది. రజత పతకం సుమారు రూ.37 వేలు పలుకుతుంది. అలాగే కాంస్యాన్ని 95 శాతం రాగి, 5 శాతం జింక్‌తో రూపొందిస్తారు. ఈ పతకం తయారీ విలువ రూ.500.
ఇంకో విశేషం ఏంటంటే ఈ సారి పతకాల్లో ఈఫిల్ టవర్ నుంచి తీసిన ఉక్కును కలుపుతున్నారు. దీంతో ఆ మెడల్స్ విలువ మరింత ఎక్కువ కానుంది.