Djokovic vs Alcaraz Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. పురుషుల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో స్టార్ ప్లేయర్లు నొవాక్ జకోవిచ్ (సెర్బియా)- కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) మధ్య గోల్డ్ మెడల్ ఫైట్ జరగనుంది. దీంతో యావత్ టెన్నిస్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది. అయితే టెన్నిస్ దిగ్గజం జకోవిచ్‌ను యంగ్ ప్లేయర్ అల్కరాస్ ఇప్పటికే రెండుసార్లు (2023, 2024)వింబుల్డన్ ఫైనల్లో ఓడించి ఛాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఒలింపిక్స్‌లోనూ జకోవిచ్‌పై ఆధిపత్యం కొనసాగించాలని అల్కరాస్ సిద్దమవుతున్నాడు.
మరోవైపు వింబుల్డన్ టైటిల్ ఫైట్‌లో రెండుసార్లు అల్కరాస్‌పై ఓడిన జకోవిచ్ ఈసారి ఎలాగైనా సత్తా చాటి స్వర్ణం ముద్దాడాలని తహతహలాడుతున్నాడు. వీరిద్దరు ఇప్పటివరకు 6సార్లు పోటీపడగా చెరో మూడుసార్లు నెగ్గారు. కాగా, రీసెంట్గా జరిగిన 2024 వింబుల్డన్ ఫైనల్లో జకోవిచ్‌పై అల్కరాస్ 6-2, 6-2, 7-6 (7-4)తో గెలుపొందాడు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ ఆగస్టు 4న జరగనుంది.