Jeetesh Sharma Marriege: టీమ్ఇండియా యంగ్ క్రికెటర్ జితేశ్ శర్మ ఓ ఇంటివాడు కానున్నాడు. మహారాష్ట్రకు చెందిన శలక మకేశ్వర్తో తన నిశ్చితార్థం జరిగినట్లు జితేశ్ శర్మ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు జితేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీరిద్దరికి గురువారం ఎంగేజ్మెంట్ జరిగినట్లు జితేశ్ పేర్కొన్నాడు. జితేశ్ సింపుల్‌గా ఫార్మల్స్ ధరించగా, మకేశ్వర్ ట్రెడిషనల్ శారీలో కనిపించారు.
ఈ సందర్భంగా కొత్త జంటకు టీమ్ఇండియా టీ20 ఫార్మాట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపాడు. సూర్యతోపాటు అర్షదీప్, రుతురాజ్ గైక్వాడ్ పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు జితేశ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, జితేశ్ 2023లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.