Ishan Kishan Domestic Cricket: టీమ్ఇండియాకు దూరమైన యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ మెంబర్ల సూచన మేరకు ఇషాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కూడా పలు డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలకు ఇషాన్ పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
అయితే టీమ్ఇండియాకు దూరమైతే తిరిగి జాతీయ జట్టులో చోటు సాధించాలంటే కాస్త డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని సెలక్షన్ కమిటీ ఇప్పటికే పలుమార్లు ఆటగాళ్లకు సూచించింది. ఈ నేపథ్యంలోనే ఇషాన్ ఝార్ఖండ్ స్టేట్ తరఫున పలు డొమెస్టిక్ టోర్నమెంట్లో ఆడనున్నాడు. రానున్న రోజుల్లో టీమ్ఇండియా పలు ద్వైపాక్షిక సిరీస్లు, ఛాంపియన్స్ట్రోఫీ, డబ్ల్యూటీసీ టోర్నీల్లో పాల్గొననుంది. ఈ టోర్నీల్లో టీమ్ఇండియాకు ఎంపిక అవ్వడమే ఇషాన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కాగా, ఇషాన్ గతేడాది నవంబర్లో సౌతాఫ్రికా పర్యటన నుంచి మధ్యలో రావడం వల్ల జట్టులో స్థానం కోల్పోయాడు.