4 Gold Medals Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఓ కుర్రాడు సంచలనం సృష్టించాడు. 22ఏళ్ల స్విమ్మర్ లియోన్ మార్చండ్ ప్రస్తుత ఒలింపిక్స్‌లో 4 బంగారు పతకాలు సాధించి ఔరా అనిపించాడు. అందులో రెండు పతకాలు ఒక్క రాత్రిలోనే సాధించి చరిత్ర సృష్టించాడు. 1976 తర్వాత స్విమ్మింగ్‌లో ఒక్క రాత్రిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు.
గురువారం జరిగిన 200మీటర్ల బటర్‌ఫ్లై, 200మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ రెండు వేర్వేరు ఈవెంట్లలో 2 స్వర్ణ పతకాలు నెగ్గగా, శుక్రవారం అర్ధరాత్రి 200మీటర్ల ఇండివిజ్యువల్ మెడ్లీలో పసిడి పట్టేశాడు. కాగా, జులై 29న 400మీటర్లు ఇండివిజ్యువల్ మెడ్లీలో నెగ్గి ఫస్ట్ గోల్డ్ మెడల్ ముద్దాడాడు. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లోనే లియోన్ ఖాతాలో 4 బంగారు పతకాలు చేరాయి.