Deputy CM Bhatti Warning to Officials : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకానిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దళిత బంధు పథకంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, దళిత బందు పథకం కింద మంజూరైన యూనిట్లను అమ్మడం, బదిలీ చేయడం నేరమన్నారు. దళిత బంధు దుర్వినియోగంలో లబ్ధిదారునికి ఎంత పాత్ర ఉంటుందో ప్రత్యేక అధికారులకు అంతే పాత్ర ఉంటుందన్నారు. మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన దళిత బంధు లబ్ధిదారులకు వారంలోగా రెండో దశ నిధులు విడుదల చేస్తామన్నారు. దళిత బంధు దారి మళ్లితే సహించేది లేదని అధికారులను భట్టి హెచ్చరించారు. వారం లోపల దారి మళ్లిన వాటిని తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలని ఆదేశించారు.
దళిత బంధు నిధులు దారి మళ్లితే సహించేది లేదు - అధికారులకు డిప్యూటీ సీఎం వార్నింగ్
Published : Aug 3, 2024, 4:31 PM IST