Thailand Prime Minister Srettha Removed : థాయ్‌లాండ్ ప్రధానిపై ఆ దేశ కోర్టు వేటువేసింది. అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్‌ను పదవి నుంచి తొలగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
ఓ న్యాయమూర్తికి లంచం ఇవ్వడానికి యత్నించిన కేసులో మాజీ కేబినెట్ మినిస్టర్ పిచిత్ చుయెన్‌బాన్‌కు 2008లో కోర్టు శిక్ష వేసింది. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను ఉద్దేశపూర్వకంగా కేబినెట్ సభ్యుడి నియామంచారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇందుకు ప్రధాని స్రెట్టాను బాధ్యులుగా చేస్తూ కోర్టు వేటు వేసింది. కొత్త ప్రధానమంత్రి నియామకానికి అక్కడి పార్లమెంటు ఆమోదం పొందేంత వరకు ఆపద్ధర్మ పద్ధతిలో ప్రస్తుత కేబినెట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, ఎప్పటిలోగా ప్రధాని పదవిని భర్తీ చేయాలనే అంశంపై కోర్టు ఎటువంటి కాల పరిమితిని విధించలేదు.