Japan Earthquake 2024 : జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ తీర ప్రాంతంలో క్యుషు ద్వీపం సమీపంలో గురువారం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.1గా నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. క్యుషు తూర్పు తీరంలో 30కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. దాంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. క్యుషు, దగ్గర్లోని షికోకు ద్వీపాన్ని ఒక మీటరు ఎత్తుతో అలలు తాక్కొచ్చని ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ భూ ప్రకంపనల ధాటికి సమీపంలోని విమానాశ్రయం అద్దాలు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
జపాన్‌లో భారీ భూకంపం - రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రత- సునామీ హెచ్చరికలు జారీ
Published : Aug 8, 2024, 2:12 PM IST
|Updated : Aug 8, 2024, 2:57 PM IST