Vikram Thangalaan Movie : కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ లీడ్ తాజాగా 'తంగలాన్' సీక్వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న పాన్ఇండియా లెవెల్లో థియేటర్లలో రానున్న నేపథ్యంలో జరిగిన ప్రమోషన్స్‌లో ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు.
"ఈ స్టోరీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రీక్వెల్, సీక్వెల్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. రెండో పార్ట్ అయితే కచ్చితంగా ఉంటుంది. అనేక కథాంశాలతో ముడిపడి ఉన్నందున ఈ చిత్రాన్ని నాలుగు పార్టులుగానూ ప్రేక్షకులకు అందించొచ్చు. రానున్న సీక్వెల్స్ మరింత కొత్తగా ఉంటాయి. నేను ఈ మాటలను సరదాగా చెప్పడం లేదు. ఈ కథకు అంతటి బలం ఉందని అంటున్నాను. అలాగే ఆ సీక్వెల్స్‌కు సంబంధించి హీరో లుక్, అలాగే కాస్ట్యూమ్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి" అని విక్రమ్ పేర్కొన్నారు.