Shraddha Kapoor Stree 2: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్ నటించిన సినిమా 'స్త్రీ- 2'. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. తాజాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'స్త్రీ- 2' బాలీవుడ్‌లో 'ఫైటర్', 'కల్కి' అడ్వాన్స్ బుకింగ్స్‌ల కలెక్షన్లను దాటేసింది. ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా వచ్చినట్లు మూవీయూనిట్ పేర్కొంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే ఫస్ట్ డే కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో రావడం పక్కా. అయితే బాలీవుడ్‌లో ఆగస్టు 15న విడుదల కానున్న చిత్రాలన్నిటి అడ్వాన్స్ బుకింగ్స్ కంటే 'స్త్రీ- 2'కే ఎక్కువ రావడం విశేషం.
కాగా, ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు నటించారు. డైరెక్టర్ అమర్‌కౌశిక్ కామెడీ, హారర్ జానర్లో ఈ మూవీ తెరకెక్కించారు. ఇక రీసెంట్గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది.