Shahrukh Khan Award : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్‌లో జరిగిన 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన్ను పార్డో అల్లా కారియరా (లైఫ్ టైమ్ అచీవ్మెంట్) అవార్డుతో సత్కరించారు. సినీ ఇండస్ట్రీకి ఆయన అందిస్తున్న విశిష్ట సేవలకుగానూ ఈ పురస్కరాన్ని అందుకున్నారు. మరోవైపు ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయ నటుడు కూడా షారుకే కావడం విశేషం.
ఇక ఈ వేడుకకు సూపర్ స్టైలిష్‌గా హాజరైన షారుక్ తన కొత్త లుక్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అక్కడి భాషలో గ్రీటింగ్స్ చెప్పి ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచారు. ఇటలీలో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఫ్యాన్స్‌తో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.