ETV Bharat / snippets

ప్రభాస్ మంచి మనసు - వయనాడ్‌ బాధితుల కోసం రూ.2 కోట్లు విరాళం

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 10:11 AM IST

Updated : Aug 7, 2024, 11:03 AM IST

source ETV Bharat
Prabhas Donates 2 crores Wayanad Landslide Tragedy (source ETV Bharat)

Prabhas Donates 2 crores Wayanad Landslide Tragedy : కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తు యావత్‌ దేశాన్ని కలచివేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది మృత్యువాత పడగా, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలోనే సహాయక చర్యల కోసం కేరళ ప్రభుత్వానికి ఆపన్న హస్తం అందించేందుకు పలువురు తెలుగు సినీ తారలు కూడా ముందుకొచ్చారు. ఇప్పటికే కథానాయకులు చిరంజీవి, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్​ తమ తరఫున కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇప్పుడు పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ కూడా వయనాడ్ విపత్తు బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. దీంతో టాలీవుడ్‌ నుంచి అంత మొత్తంలో విరాళాన్ని ప్రకటించిన హీరో ప్రభాసే కావడం విశేషమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్​ది గొప్ప మనసుని మెచ్చుకుంటున్నారు.

Last Updated : Aug 7, 2024, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.