Devara Dialogue leaked : యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాలశివ కాంబినేషన్లో వస్తున్న దేవర రెండు భాగాలుగా విడుదల కానున్నసంగతి తెలిసిందే. మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభించుకున్నప్పటి నుంచి ఏదో ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంది.
రీసెంట్గా ఈ చిత్రం డబ్బింగ్ పనులను ప్రారంభించుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా గూస్ బంప్స్ పుట్టించే ఓ డైలాగ్ లీక్ అయింది. "సాదా సీదా మగాళ్ళు కావాలా, ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా!" అనే డైలాగ్ ప్రస్తుతం నెట్టింట్ట తెగ వైరల్ అవుతోంది. అంటే దేవరలో తారక్ ఓ ఊరి కోసం పోరాడే వీరుడని తెలుస్తోంది. అంతేకాదు గ్రామం కోసం ఏ త్యాగమైనా, ఏ తెగింపుకైనా సిద్ధమైన వ్యక్తి కథ అని తెలిసింది. మొత్తంగా దేవర ఓ సాదాసీదా వ్యక్తి కథ కాదు ఓ వీరుడి కథ అని ఈ డైలాగ్‌తో అర్థమవుతోంది.