Adivi Sesh Goodhachari 2 Release Date : అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారి అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా జీ2 : గూఢచారి2 రెడీ అవుతోంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ గురించి చిత్రబృందం స్పందించింది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. అంటే సినిమా రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
కాగా, గూఢచారి కథ భారతదేశంలోనే జరగగా రెండో భాగం అంతర్జాతీయంగా సాగనుంది. ఈ సెకండ్ పార్ట్‌లో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కనిపించనున్నారు. ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుపుకుంటోంది.