ETV Bharat / snippets

వరదల ధాటికి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 8:30 AM IST

Tungabhadra dam gate's chain snaps
Tungabhadra Dam Gate washed away (ETV Bharat)

Tungabhadra Dam Gate's Chain Snaps : కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్‌ గేటు వరదల ధాటికి కొట్టుకుపోయింది. శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్‌ లింక్‌ తెగిపోవడం వల్ల 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటి వరకు లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోయింది. తుంగభద్ర నుంచి ఇంకా 60 టీఎంసీల నీరు వృథాగా పోనుంది. షిమోగలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. అందువల్ల నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేసులకు వరద ప్రవాహం కొనసాగనుంది. వరద ఎక్కువగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. తుంగభద్రలో వరద తగ్గాక మరమ్మతులు చేపడతామని అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.