T V Somanathan Appointed As Cabinet Secretary : కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ నియమితులయ్యారు. రాజీవ్ గౌబా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 2024 ఆగస్టు 30 నుంచి రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. కేబినెట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే వరకు ఆయన్ను కేబినెట్ సెక్రటేరియట్‌లో 'ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ'గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్ తమిళనాడు క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సోమనాథన్, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా ఉన్నారు. రాజీవ్ గౌబా పదవీకాలాన్ని ఇప్పటివరకు మూడుసార్లు పొడిగించారు.
కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా టీవీ సోమనాథన్ నియామకం
Published : Aug 10, 2024, 7:24 PM IST