SC Deadline For Leash On Healthcare Professional Act : ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన అనుబంధ వృత్తుల చట్టాన్ని అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు సోమవారం మండిపడింది. అక్టోబరు 12వ తేదీకల్లా ఈ చట్టాన్ని అమలుచేయాలని ఆదేశించింది. దీనిని ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ చట్టం అమలుపై 2వారాల్లోగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలకు చెందిన అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో అన్‌లైన్ సమావేశం నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించింది. మూడేళ్లయినా ఈ చట్టం అమలుకాకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యానికి 2 వారాల్లో సమాధానం దాఖలు చేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీని ధర్మాసనం ఆదేశించింది.
'హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ యాక్ట్‌ను అమలు చేయాల్సిందే' - సుప్రీం కోర్ట్
Published : Aug 13, 2024, 9:01 AM IST